25, మే 2016, బుధవారం

GODAVARI CINE SOWRABHALU -1 ( గోదావరి సినిమా సౌరభాలు-1 )

గోదావరి గడ్డకి, సినిమా రంగానికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఈ గోదావరి నీటిలో ఏదో మహిమ వుంది. ఈ రెండు జిల్లాలనుంచి ఎంతో మంది సినీ ప్రముఖులు తయారయ్యారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి,  అంజలీదేవి, సూర్యకాంతం, రేలంగి, అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, E.V.V.సత్యనారాయణ, బాపు-రమణ, చిరంజీవి, కోడి రామకృష్ణ, సుకుమార్, కృష్ణుడు, అల్లరి నరేష్, అంజలి, హేమ మొదలయిన ఏంతో మంది ఈ గోదావరి గడ్డ మీద పుట్టిన వారే. వారి గురించి కొంత సమాచారం తెలుసుకుందాం .   

చిరంజీవి (CHIRANJEEVI)

చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కథానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అని  ఆంధ్ర ప్రేక్షకుల అభిమానంగా పిలుచుకునే స్థాయికి చేరుకున్నారు . మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి ఆగష్టు 22, 1955 న జన్మించాడు. చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కథానాయకుడు). చిరంజీవి బావ అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కథానాయకునిగా రాణిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కుడా సినిమా హీరోగా ఎదిగారు.. చిరంజీవి "ప్రజారాజ్యం" అని ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర ప్రభుత్వములో మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం 150 వ చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు,


దాసరి నారాయణరావు (DASARI NARAYANA RAO)

డా. దాసరి నారాయణరావు  సినిమా దర్శకుడు,రచయిత,సినీ నిర్మాత మరియు రాజకీయ నాయకుడు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో 1947, మే 4న జన్మించారు. అత్యధిక చిత్రాల నిర్మిచిన దర్శకుడుగా గిన్నిస్స్ బుక్   లో చోటు సంపాదించారు . దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు. కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టభద్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవారు. అనతి కాలంలోనే ప్రతిభగల రంగస్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయము చేసారు , వారందరూ ఇప్పుడు  గొప్ప స్థానాలలో వున్నారు .

అంజలి (ANJALI)

అంజలి తూర్పు గోదావరి జిల్లా , మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. అంజలికి  ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నై కి  మకాం మార్చి సినిమాలలో నటించడం ప్రారంభించింది . సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు చిత్రంతో తెలుగులో మంచి   గుర్తింపు  వచ్చి బిజీతారగా మారింది.




ఆలీ (ALI)


ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడుగా గుర్తింపు పొందాడు . .ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమం డ్రిలో ఒక నిరుపేద కుటంబంలో జన్మిం చాడు. తండ్రి అబ్దుల్ సుభాణ్ దర్జీ పని చేసే వాడు. తల్లి జైతున్ బీబీ గృహిణి. ఆలీ చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి పెంచు కున్నాడు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. బాల నటుడుగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా పాపులర్ అయ్యాడు . అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేటు  ఇచ్చి సత్కరించారు .




కోడి రామ కృష్ణ (KODI RAMAKRISHNA)


కోడి రామ కృష్ణ నాటక రంగం నుంచి వచ్చి న ప్రతిభావంతు లైన దర్శ కులలో ఒకడు. ఈయన స్వస్థలం పాలకొ ల్లు. పాలకొల్లులో గల లలిత కళాంజలి అనే సంస్థ ద్వారా అనేక నాటకాలలో  వేషాలు వేసారు. ఈయన తీసిన చిత్రాలు 175 రోజులు ఆడటం వలన ఈయనను సిల్వర్ జూబ్లీ దర్శకుడని పిలుస్తారు . ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ య్య (1981), కోడి రామకృష్ణకు దర్శ కుడిగా తొలిచిత్రం . దర్శకుడిగా దాసరి నారా యణరా వుని పరిచయం చేసిన నిర్మాత కె.రాఘవ, దాసరి నారాయణ రావు గారి  శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. ఈయన ప్రముఖ హీరో ఎన్.టి. రామారావు మినహా అందరు కథా నాయకుల సినిమాలు తీసారు . నూరు పైగా చిత్రాలు చేసిన నలుగురు తెలుగు దర్శకులలో ఒకరు. (దాసరి, కె.ఎస్.ఆర్ దాస్, కె.రాఘవేంద్ర రావులు మిగతా మువ్వురు). దర్శ కునిగా గుర్తింపు పొందాక నటునిగా కూడా ప్రయ త్నించారు.




ఆర్. నారాయణమూర్తి (R.NARAYANA MURTHY)

R. నారాయణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించాడు. రౌతులపూడిలో 5వ తరగతి వరకు చదివాడు. రౌతులపూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. చిన్న తనం నుండి సినిమాలలో ఆసక్తితో ఎన్టీయార్ మరియు నాగేశ్వరరావుల సినిమాలు చూసి, విరామ సమయంలో వారిని అనుకరించేవాడు. అక్కడే తన నటనా జీవితా నికి పునాది పడిందని చెప్పుకున్నారు. శంఖ వరంలో ఉన్నత పాఠశా లలో చేరాడు. అక్కడే నారాయణమూర్తికి సామాజిక స్పృహ కలి గింది. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా తనదైన బాణీని కొనసాగిస్తున్నాడు.



కృష్ణుడు(KRISHUDU)
కృష్ణుడు తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా, చింతల పల్లిలో జన్మించాడు. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోనూ మరియు ఉన్నత విద్యాభ్యాసాన్ని బెంగుళూరులోనూ పూర్తి చేశాడు. ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను చేస్తూ గుర్తిపు పొందిన సినిమా నటుడు . హ్యాపీడేస్ చిత్రం తర్వాత కృష్ణుడు హీరోగా వినాయకుడు, విలేజిలో వినాయకుడు, నాకూ ఓ లవర్ ఉంది తదితర చిత్రాలలో హీరోగా నటించాడు.






సుకుమార్ (SUKUMAR)


సుకుమార్ స్వగ్రామం రాజోలు కి దగ్గరలో గల మట్టపర్రు గ్రామం.సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకుడు కాక ముందు అధ్యాపకుడు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య 2 సరిగ్గా నడవలేదు. నాల్గవ ఛిత్రం 100% లవ్ సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చెసింది.అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి. మరెంతో మంది ప్రముఖ కధానాయకులతో సినిమాలు తీయడానికి రెడీ గా వున్నాడు.



తనికెళ్ల భరణి (TANIKELLA BHARANI)


తనికెళ్ళ భరణి  స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురంలో జులై 14, 1956 లో జన్మించారు.  తెలుగు సినిమా నటుడు,మంచి రచయత గా గుర్తింపు పొందారు . తెలుగు భాషాభిమాని.  తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకలాకళా కోవిదుడు. ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి