![]() |
DUVVURI SUBBARAO (Ex.Governer RBI) |
దువ్వూరి సుబ్బారావు గారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ 22వ గవర్నర్ గా పనిచేసారు. దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆగష్టు 11, 1949న జన్మించారు. హైస్కూలు విద్యని కోరుకొండ సైనిక పాఠశాల లో చదివారు. CRR కాలేజీలో B.Sc., చదివారు. ఆ తరువాత అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టాపొంది, ఆంధ్రా యునివర్సిటీ నుండి Phd పొందారు. 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి, ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు . ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితుడైన తొలి వ్యక్తి శ్రీ దువ్వూరి సుబ్బారావు గారు.
నిర్వహించిన పదవులు
1988–1993 : కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రెటరీగా
1993-1998 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా
1998-2004: ప్రపంచ బ్యాంకు తరఫున ఆఫ్రికా తదితర దేశాలలో ఆర్థిక అద్యయనం
2004–2008 : కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా
2008-20013: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి