![]() |
కొబ్బరి దింపు |
కొందరు రైతులు కొబ్బరి తోటలను తొలగించి వ్యవసాయ భూములుగా, చేపల చెరువులుగా మార్పు చేసుకున్నారు. ఇప్పుడు డెల్టా ప్రాంతంలో కొబ్బరి తోటలు 50శాతానికి తగ్గిపోయాయి. చేలగట్లు, కాల్వగట్లు, పుంతలు, ఇంటి పెరడు ఇలా పలు ప్రాంతాల్లో కొబ్బరి సాగుచేస్తున్నప్పటికీ, తోటల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.. కొబ్బరి ధరలలో వ్యత్యాసం ఉండటం, చెట్ల నుంచి కొబ్బరి కాయలు దింపడానికి సైతం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడంతో కొబ్బరిపై రైతులు నిరాశక్తత పెంరిగింది.
కొబ్బరిదింపు కార్మికుల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. దింపు కార్మికులలో ఇప్పుడు పాతతరం కార్మికులు మినహా యువత ఒక్కశాతం కూడా కుల వృత్తివైపు రావడంలేదు. విద్యావకాశాలు మెరుగుపడడం, ఉపాధి అవకాశాలు పెరగడంతో రెండు దశాబ్దాల కాలంలో దింపు కార్మికులు పదిశాతానికి తగ్గిపోయారు.. ఇప్పుడు ఒక్కచెట్టు నుంచి కొబ్బరికాయలు దింపాలంటే జిల్లాలోని ఆయా ప్రాంతాలను బట్టి రూ. 15 నుంచి రూ. 25 డిమాండ్ చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి కాయలు దింపడానికి రూ. 500లు తీసుకుంటుంటే, మరి కొన్ని ప్రాంతాలలో వందకాయలకు 10 కాయలు చొప్పున దింపు కూలీగా తీసుకుంటున్నారు. ఇలా అధికమొత్తం ఖర్చుతో కొబ్బరి దింపుతున్నప్పటికీ గతంలో మాదిరిగా నెల రోజులకు ఒక పర్యాయం కాకుండా నాలుగు నెలలకు ఒకసారి కొబ్బరి దింపు తీయిస్తున్నారు.
![]() |
Hydraulic Equipment for coconut dropping |
సత్ఫలితాలనివ్వలేదు.. హైడ్రాలిక్ నిచ్చెనలు, కోతులకు శిక్షణ ఇవ్వడం, కొబ్బరి దింపడానికి కార్మికులకు శిక్షణ ఇవ్వడం ఇలా అనేక విధాలు ప్రయత్నాలు చేసినప్పటికీ దింపు సమస్యకు పరిష్కారం దొరకలేదు.
![]() |
Hybrid coconut tree |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి