![]() |
BAPU |
బాపు చిత్రకళ ఒక విషయానికి పరిమితంకాలేదు. 1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా సృష్టిస్తున్నాడు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు.
![]() |
బాపు అక్షరమాల (ఫాంట్) |
బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి.
బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి. స్టీవార్ట్స్ సంస్థలోనూ పని
![]() |
బాపు - రమణ |
![]() |
బుడుగు - సిగానపెసూనంబ |
బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా ( స్టోరీబోర్డు ) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కిస్తాడు.ఈ విధానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటాడో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించగలుగుతాడు.
బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి,ఆయన తీసిన " సీతాకల్యాణం " సినిమా లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.
బాపు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు
1.శ్రీరామరాజ్యం,2011 2.సుందరకాండ,2008 3.రాధా గోపాళం,2005 4.రాంబంటు ,1996 5.పెళ్ళికొడుకు,1994 6.శ్రీనాథ కవిసార్వభౌమ,1993 7.మిష్టర్ ళ్ళాం,1993 8.పెళ్ళి పుస్తకం,1991 9.కళ్యాణ తాంబూలం,1986 10.బుల్లెట్,1985 11.జాకీ,1985 12. సేత,1984 13.మంత్రిగారి వియ్యంకుడు,1983 14.ఏది ధర్మం ఏది న్యాయం,1982 15.కృష్ణావతారం,1982 16.పెళ్ళీడు పిల్లలు,1982 17.రాధా కళ్యాణం,1981 18.త్యాగయ్య,1981 19.వంశవృక్షం,1980 20.కలియుగ రావణాసురుడు,1980 21.పండంటి జీవితం,1980 22.రాజాధిరాజు,1980
23.తూర్పు వెళ్ళే రైలు,1979 24.మనవూరి పాండవులు,1978 25.గోరంత దీపం,1978 26.స్నేహం,1977 27.భక్త కన్నప్ప,1976 28.శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్,1976 29.సీతాకల్యాణం,1976 30.ముత్యాల ముగ్గు,1975 31.శ్రీ రామాంజనేయ యుద్ధం,1974 32.అందాల రాముడు,1973 33.సంపూర్ణ రామాయణం,1971 34.బాలరాజు కథ,1970 35.ఇంటి గౌరవం,1970 36.బుద్ధిమంతుడు,1969 37.బంగారు పిచ్చుక,1968 38.సాక్షి,1967
బాపు చిత్రకారునిగా పలు పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు. పత్రికల్లో కథలకు, నవలలకు ఆయన వేసిన చిత్రాలు మౌనవ్యాఖ్యలుగా అమరాయి అని విమర్శకులు బాపు బొమ్మల్ని ప్రశంసించారు.
బాపు బొమ్మలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి