24, మే 2016, మంగళవారం

COASTAL ANDHRA PRADESH (కోస్తాంధ్ర)



కోస్తా లేదా కోస్తాంధ్ర ఆంధ్ర ప్రదేశ్ లోని సముద్ర తీరప్రాంతము.

ఆంధ్ర ప్రదేశ్‌లోని రెండు  ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.

మొత్తము కోస్తాలో 9 జిల్లాలు వున్నాయి అవి వరుసగా

(1) శ్రీకాకుళం  (2) విజయనగరం  (3) విశాఖపట్నం  (4) తూర్పు గోదావరి  (5) పశ్చిమ గోదావరి  (6) కృష్ణా జిల్లా (7) గుంటూరు  (8) ప్రకాశం  (9)నెల్లూరు

బ్రిటీషు ప్రభుత్వము యొక్క పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ మొత్తం ప్రాంతాన్ని సర్కారు అని కూడా పిలుస్తారు . ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల బంగాళాఖాత తీరం వెంబడే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం మనది . గోదావరి, కృష్ణా, పెన్నానదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. వరి, చెరకు,కొబ్బరి పంటలు ఇక్కడ ప్రధానంగా పండుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి