30, మే 2016, సోమవారం

Coconut Workers (కొబ్బరి దింపు,ఒలుపు కార్మికులు)

తూర్పుగోదావరి జిల్లా (East Godavari) లోని కోనసీమ (Konaseema) పేరు చెబితే ... సిరులు కురిపించే కొబ్బరి పంట అందరికీ గుర్తుకొస్తుంది. కోనసీమ అంతటా ఎక్కడ చూసినా  మనని  మైమరిపించే,  అంబరాన్ని చుంబించే పచ్చని కొబ్బరిచెట్లే కనిపిస్తాయి. ఇంత అందమైన కొబ్బరిచెట్ల నుంచి మనకు కావలసిన కొబ్బరికాయల్ని,ఇతర ఉత్పత్తులను అందిస్తున్న కార్మికుల పని వివరాలను పరిశీలిద్దాము.  

ఇక అసలు విషయానికి వస్తే, కొబ్బరి ఉత్పత్తులు మన దగ్గరకు చేరడానికి ముందు చాలా మంది కార్మికుల శ్రమ అందులో వుంటుంది. ఈ ఉత్పత్తులను తయారుచేయడానికి రకరకాల నైపుణ్యం కలిగిన కార్మికులు అవసమవుతారు. వారిలో ప్రముఖ పాత్ర కొబ్బరి దింపు కార్మికులు, కొబ్బరి ఒలుపు కార్మికులు, కొబ్బరి కాయలను నాణెం చేసే కార్మికులది.  కోనసీమలోని 16 మండలాల్లో విస్తరించి ఉన్న కొబ్బరి పంటపై ఆధారపడి సుమారు ఒక లక్ష కుటుంబాల వారు  కార్మికులుగా  జీవనోపాధి పొందుతున్నారు. కొబ్బరి దింపు, ఒలుపు కార్మికులు చేసే పని  నిజంగా సాహసంతోను, ప్రమాదంతో  కూడుకున్నది.

దింపు కార్మికులు
దింపు కార్మికులు, దింపు తీసే సమయంలో పట్టు జారినా, విద్యుత్తు తీగలు తగిలినా చాలా ప్రమాదంలో పడతారు. చాలా సార్లు ప్రమాదానికి గురైన కార్మికులు ఉపాధికి శాశ్వతంగా దూరమౌతున్నారు.

కొబ్బరి ఒలుపు కార్మికులు












ఇక కొబ్బరి ఒలుపు కార్మికుడు వయస్సును బట్టి వంట్లో ఉండే శక్తిని బట్టి 500 నుంచి వెయ్యి కాయలు ఒలుస్తారు. వెయ్యి కాయలు ఒలుపునకు రూ.350 ఇస్తారు. ,కొబ్బరి ఒలుపులో ఆదమరిస్తే రెప్ప పాటులో బల్లెం అరచేతిలో లేదా కాలి తొడ, గుండెలలో దిగబడిపోయి ప్రాణాపాయం జరుగుతుంది. ఒలుపు ఒలుస్తూ బల్లెం గుండెల్లో దిగబడి చనిపోయిన ఒలుపు కార్మికులున్నారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి