6, ఏప్రిల్ 2016, బుధవారం

Yendamuri Veerendranadh (యండమూరి వీరేంధ్రనాథ్ )


యండమూరి  వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్  కు  చెందిన  ప్రముఖ రచయితవ్యక్తిత్వ  వికాస  నిపుణుడు. తూర్పు   గోదావరి జిల్లా Razole (రాజోలు) లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబర్   14 1948 లో  జన్మించాడు

ఇతడు  తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చినాయి.




బాల్యం, విద్యాభ్యాసం
యందమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా Razole (రాజోలు) లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబర్ 14 1948 లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. ప్రాథమిక విద్య కాకినాడరాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972 లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు.
ఉద్యోగం
వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన యండమూరి ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో, పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
కుటుంబం
ఆయనకు 10-03-1974 లో అనుగీత తో వివాహం జరిగింది. వారి కుమారుడి పేరు ప్రణీత్.
పురస్కారాలు
·         ఘుపతి రాఘవ రాజారాం నాటకానికి 1982 లో సాహిత్య అకాడెమీ అవార్డు
·         1996 లో వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహికకు ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది   పురస్కారం.





సినిమాలుగా వచ్చిన యండమూరి నవలలు
నవల పేరు
సినిమా పేరు
వెన్నెల్లో ఆడపిల్ల
హలో లవ్ యూ
తులసిదళం
తులసిదళం
తులసి
కాష్మోరా
అభిలాష
అభిలాష
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు
ఛాలెంజ్
అగ్నిప్రవేశం
అగ్నిప్రవేశం
ఆఖరి పోరాటం
ఆఖరి పోరాటం
మరణ మృదంగం
మరణ మృదంగం
నల్లంచు తెల్లచీర
దొంగమొగుడు*
ఒక రాధ-ఇద్దరు కృష్ణులు
ఒక రాధ-ఇద్దరు కృష్ణులు
స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్
స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్
రుద్రనేత్ర
రుద్రనేత్ర
రాక్షసుడు
రాక్షసుడు
ధ్రిల్లర్
ముత్యమంత ముద్దు
అంతర్ముఖం
సంపూర్ణ ప్రేమాయణం

దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచు తెల్లచీర నవల వ్రాయబడినది. రెండింటి మధ్య చాలా 
తేడాలు(పాత్రలు,కథ) ఉన్నాయి.
వ్యక్తిత్వ వికాస రచనలు
·         విజయానికి అయిదు మెట్లు
·         విజయానికి ఆరవ మెట్టు 
·         విజయ రహస్యాలు
·         మీరు మంచి అమ్మాయి కాదు
·         మిమ్మల్ని మీరు గెలవగలరుమిమ్మల్ని మీరు గెలవగలరు (అర్కీవ్.అర్గ్ లో పుస్తకం)
·         విజయంలో భాగస్వామ్యం
·         విజయం వైపు పయనం 
·         మైండ్ పవర్ నెంబర్ ఒన్ అవడం ఎలా?
·         గ్రాఫాలజీ
·         తప్పు చేద్దాం రండి


సినిమా మాటల రచయితగా
·         కొండవీటి దొంగ
·         అభిలాష
·         మంచు పల్లకి
·         స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ - కథ
·         ప్రియరాగాలు - కథ
సినీ దర్శకుడిగా
·         అగ్నిప్రవేశం
·         స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి